KMR: రెవెన్యూ అధికారులపై దాడిని నిరసిస్తూ మంగళవారం బీర్కూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసీల్దార్ లతతో పాటు కార్యలయం సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం స్థల సేకరణ కోసం వచ్చిన రెవెన్యూ అధికారులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.