సిద్దిపేట: మిట్టపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నెం 172 నుంచి అక్రమంగా మట్టిని తవ్వి విక్రయించినందుకు మందపల్లికి చెందిన పన్యాల గాంధీ రెడ్డిని సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిట్టపల్లి గ్రామ పరిపాలన అధికారి మహేష్ ఫిర్యాదు మేరకు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా మట్టిని తరలించినందుకు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.