BHNG: బీబీనగర్ మండలం కొండమడుగు శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్లో ప్రయాణిస్తున్న ఇద్దరు కార్మికులు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో హరి అనే వ్యక్తికి ఒక కాలు పూర్తిగా తెగిపోగా, బిలాల్ అనే వ్యక్తికి ఒక కాలు విరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

