MNCL: కాసిపేట మండలం కుర్రెగాడ్లో ఈనెల 18వ తేదీ నుంచి 20 వరకు నిర్వహిస్తున్న పాహుండీ కుపర్ లింగుస్వామి జాతర పోస్టర్లను బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రత్నం లక్ష్మి గురువారం విడుదల చేశారు. జాతర నిర్వాహకులు మడావి వెంకటేష్, శంకర్లు జాతరకు ముఖ్య అతిధులుగా హాజరై జాతరను విజయవంతం చేయాలని ఆమెను కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.