HYD: GHMC పరిధిలో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ CMTC వద్ద 100.5 మి.మీ.గా నమోదైంది. తరువాత ఖైరతాబాద్ శ్రీనగర్ కాలనీలో 93.0 మి.మీ, బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీలో 74.3 మి.మీ. వర్షం కురిసింది. అమీర్‌పేట్ మైత్రివనంలో 64.3 మి.మీ., ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ జోనల్ కమిషనర్ ఆఫీస్ వద్ద 62.3 మి.మీ వర్షపాతం నమోదైంది.