BDK: భద్రాచలం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులను , స్కానింగ్ సెంటర్లను డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆర్ చైతన్య గురువారం తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా స్కానింగ్ సెంటర్లలో ఉన్న సదుపాయాలు, సిబ్బంది, రోగులకు అందిస్తున్న వైద్య సేవల నాణ్యత వంటి అంశాలను పరిశీలించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే స్కానింగ్ సెంటర్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు.