KMM: పాలన, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తమ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఉదయం కాసేపు గడిపారు. పచ్చని పంట పొల్లాల్లో కలియ తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించారు. ఆయిల్ ఫామ్ సాగులో ఇంకా తీసుకోవాల్సిన చర్యలు, సస్య రక్షణ పద్ధతుల గురించి కూలీలతో చర్చించారు.