SRCL: వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్(2024-25) ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో సకల వసతులు, తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.