కరీంనగర్: అశాస్త్రీయమైన జి.ఓ 25 అమలు చేయాలని పాఠశాల విద్యా సంచాలకుడు కలెక్టర్లను ఆదేశించడాన్ని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, అదే విధంగా 60 మంది విద్యార్థులకు కూడా ఇద్దరే ఉపాధ్యాయులను కేటాయించాలని పేర్కొనడం అసంబద్ధమైన విషయం అని అన్నారు.