HYD: పుట్టి 15 రోజులు కాకముందే పసికందును తల్లిదండ్రులు అంగట్లో సరకులా అమ్మకానికి పెట్టిన దారుణ సంఘటన ఇది. నగర టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం..ఫలక్నామా వట్టేపల్లికి చెందిన సలీం కమీషన్ తీసుకుని చిరు వ్యాపారాలు చేస్తుంటాడు. అత్తాపూర్ 9వ నంబరు పహాడీకి చెందిన ఆటోడ్రైవర్ షేక్ ఇస్మాయిల్, సుల్తానాబేగం దంపతులకు 15 రోజుల క్రితం బాబు జన్మించాడు. ఈ బాబుని అమ్మకాని పెట్టారు.