JGL: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కలెక్టర్ సత్యప్రసాద్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగా ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక వసతులు, బోధన కల్పించడంలో విఫలమైందన్నారు. జాబితాపూర్ పాఠశాలలో టాయిలెట్స్, మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు.