NLG: కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి 4,852.39 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 4 గేట్లు పైకెత్తి 4,326.24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువ ద్వారా 314 క్యూసెక్కులు నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 644 అడుగుల నీరు నిల్వ ఉంది.