KMM: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం మంత్రి కోమటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో ప్రతిపాదించిన పనుల పురోగతిని తెలుసుకొని, అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే అది నారాయణ కోరారు.