SRD: సంగారెడ్డి మండలం పరిధిలోని ఫసల్వాది జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలను మండల విద్యాధికారి విద్యాసాగర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలుచేస్తున్నమధ్యాహ్న భోజనం, రికార్డులను, విద్యార్థుల చదువుతున్న తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యయులు పాల్గొన్నారు.