PDPL : గోదావరిఖని లక్ష్మీ నగర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి శ్యాంసుందర్ శర్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సదాశయ ఫౌండేషన్ ద్వారా ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో నేత్రదానం గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు అభినందన పత్రాన్ని అందజేశారు.