NRML: ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో నీటి సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కొత్త కాలనీలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని స్థానిక కౌన్సిలర్ ఆయనకు తెలిపారు. దీంతో బుధవారం నూతన బోరును ఏర్పాటు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు.