ADB: జైనథ్ మండలంలోని కాప్రి నుంచి బేల గ్రామం వరకు నూతనంగా మంజూరైన రోడ్డు పనులను సోమవారం ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేసి ప్రజల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.