NRML: బాసర -బైంసా జాతీయ రహదారిని రెవెన్యూ, పోలీస్, జాతీయ రహదారుల శాఖ అధికారులు కలిసి గురువారం పరిశీలించారు. భైంసా పాత చెక్ పోస్ట్ నుంచి ముధోల్, బాసర వరకు రోడ్డు ప్రమాద స్థలాలను గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో రోడ్డు ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. త్వరలో ఆయా చోట్ల ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.