BHPL: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణపై రైతులు ఎలాంటి అపోహలు చెందొద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రైతులతో సమావేశం నిర్వహించారు. దేశాభివృద్ధికి రహదారులు చాలా అవసరమని గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ద్వారా జిల్లా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.