VZM: నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2025-26 శిక్షణ నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇటీవల మంజూరైన ఉపాధి హామీ వెండర్ ఐడి పనులు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బయటకు విచ్చేశారు. కొద్దిసేపు నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయకుంటే ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కాబోమని స్పష్టం చేశారు.