TG: రాష్ట్రంలో బీఆర్ఎస్కు నూకలు చెల్లాయని అందువల్లే ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గత పదేళ్ల అభివృద్ధికి ఏడాది కాంగ్రెస్ పాలనలోని అభివృద్ధిపై మేం చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. రెండు దఫాలుగా నీళ్లు, నిధులు నియామకాల పేరుతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసగించారంటూ మండిపడ్డారు.