మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను BRS నాయకులు ఆదివారం దగ్ధం చేశారు. మాజీ గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ రామవత్ వాల్య నాయక్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రైతులకు ఇచ్చిన 15వెల రూపాయల రైతు భరోసా హామీని వర్షాకాలం సీజన్లో ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఈ సందర్భంగా విమర్శించారు.