NZB: రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాకముందే ప్రజా వ్యతిరేకత మొదలైందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం బీజేపీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ను ప్రజలుబొంద పెట్టారని, అదే పరిస్థితి కాంగ్రెస్కు కూడా వస్తుందన్నారు. తాము సభ్యత్వ నమోదు కోసంవెళితే గ్రామ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినతి పత్రాలు సమర్పిస్తున్నారని అన్నారు.