కామారెడ్డి: జిల్లా కేంద్రంలో ఆదివారం ఎస్సీ వసతి గృహాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో అల్పాహారం రుచి చూశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సంక్షేమ అధికారికి సూచించారు. చదువుతోపాటు క్రీడలు నేర్పించాలని కోరారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నారు.