KNR: పదిరోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీసేవా సేవలు నిలిచిపోయాయి. దీంతో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర డాటా సెంటర్లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్తున్నారు.