SRD: నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో సంగారెడ్డి పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో నిర్మిస్తున్న దుకాణ సముదాయ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మూడు సంవత్సరాల క్రితం దుకాణ సముదాయాల కోసం 53 లక్షల రూపాయల నిధులను కేటాయించారు. నిధులు విడుదల కాకపోవడంతో స్లాబ్ వరకు నిర్మించి వదిలేశారు. దుకాణ సముదాయ పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు.