WNP: ఉమ్మడి జిల్లాలో 14 లక్షల మందిని వలస పాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆంధ్ర రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరును ఎడారిగా మార్చారని పేర్కొన్నారు.