ఖమ్మం: దమ్మపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం పండిట్ దిన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ సభ్యులు ధారా నాగేశ్వరావు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు.