సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసీ మల్టీపర్సస్ ఫంక్షన్ హాలులో అంగన్వాడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషన్ అభియాన్ పోషణ మాసం కార్యక్రమాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు.