సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఎప్పుడూ టాప్ ప్లేస్లోనే ఉంటుంది. అలాగే యూజర్స్‌కు కూడా అదిరిపోయే ఫీచర్స్‌ను అందిస్తుంది. తాజాగా క్లోజ్ ఫ్రెండ్స్ కోసం మరో అప్డేట్ను తీసుకొచ్చింది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేయడం సర్వసాధారణం. చాలా మంది స్టోరీలూ పెట్టడానికి ఇష్టపడుతుంటారు. కొందరు మాత్రం స్టోరీలు పెట్టడానికి ఇష్టపడరు. పోస్టులు అయితే ప్రైవేట్‌లో పెట్టొచ్చు, కానీ స్టోరీలకు ఆ అవకాశం లేదు కదా అని సంకోచిస్తుంటారు. అయితే, పోస్టుల మాదిరిగానే స్టోరీలకు కూడా ప్రైవసీ ఎంచుకొనే సదుపాయం కల్పించింది ఇన్స్టాగ్రామ్. మిమ్మల్ని ఫాలో అవుతున్న వారిలో కొందరికి స్టోరీ కనిపించకూడదని అనుకుంటే తాజా అప్డేట్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా వారిని అన్‌ఫాలో కావాల్సిన అవసరం కూడా లేదు. అలాగే క్లోస్ ఫ్రెండ్స్ (Close Friends) లిస్ట్ ఆప్షన్ కూడా ఎంచుకోవాల్సిన పని లేదు.
ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి.
పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్, ప్రైవసీని ఎంచుకోండి.
కిందకు స్క్రోల్ చేయగానే Who Can See Your Content అనే ట్యాబ్‌లో Hide Story And Live ఆప్షన్ ను ట్యాప్ చేయాలి.
మీరు ఫాలో అవుతున్న వారి లిస్ట్ వస్తుంది. అందులో మీరు చూడాలనుకునే వారిపై క్లిక్ చేయండి.