12 ఏళ్లుగా సొంతగడ్డపై టీమిండియాకు తిరుగులేదు. వరుసగా 18 టెస్ట్ సిరీస్‌లు గెలిచింది. కానీ తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కోల్పోయింది. గతంలో 2012లో ఇంగ్లండ్‌పై స్వదేశంలో ఓడిన భారత్.. ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. విచిత్రం ఏంటంటే.. శ్రీలంకలో ఆ జట్టు చేతిలో ఘోరంగా ఓడిన కివీస్.. రోహిత్ సేనపై మాత్రం అద్భుతంగా పోరాడి ఘన విజయం సాధించింది.