పట్నా పైరేట్స్ స్టార్ రెయిడర్ దేవాంక్ కండ్లు చెదిరే కూతతో రికార్డులు తిరగరాశాడు. కూతకెళ్లి ఏకంగా 25 పాయింట్లు సాధించాడు. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌పై పట్నా పైరేట్స్ 42-40తో ఉత్కంఠ విజయం సాధించింది. పట్నా ఆల్‌రౌండర్ అనికెత్ (4), గుర్దీప్ (2 ), సందీప్ (2) పాయింట్లతో మెరిశారు.
Tags :