గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న టీమిండియా పేస్ బౌలర్ షమీ మళ్లీ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. మోకాలి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న షమీ రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టు తరపున ఆడుతాడని ఆ రాష్ట్ర కోచ్ లక్షీరతన్ శుక్లా స్పష్టం చేశాడు. దీంతో ఈ ఏడాది నవంబర్లో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి షమీ సిద్ధమవుతున్నాడు. అయితే ఆసీస్ టూర్కు ముందు రంజీల్లో రాణిస్తే.. కంగారు గడ్డపై ప్రధాన అస్త్రమవుతాడని శుక్లా పేర్కొన్నాడు.