బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించి నాలుగు టీ20లు ఆడనుంది. అయితే కొన్నిరోజులకే ఆస్ట్రేలియాలో కీలక టెస్ట్ సిరీస్ కూడా ఆడనుంది. దీంతో రెండు వేర్వేరు టీమ్‌లను దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాకు బీసీసీఐ పంపనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించింది. ఆసీస్ పర్యటనకు రెగ్యులర్ కోచ్ గంభీర్ వెళ్లనున్నాడు.