చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 222/9 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయటంతో బంగ్లా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మరోవైపు తొలుత బ్యాటింగ్లో అశ్విన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.