ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని అర్జున్‌కి ఇచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతికి భువనేశ్వర్ కుమార్ రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ముంబై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్జున్ 2.5 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
IPL2023: ఐపీఎల్లో మంగళవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ను క్రికెట్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్(Arjun Tendulkar) మరిచిపోలేడు. 23 ఏళ్ల అర్జున్ చివరి ఓవర్లో భువనేశ్వర్ కుమార్( Bhuvneshwar Kumar)ను అవుట్ చేయడం ద్వారా ఐపీఎల్(IPL)లో తన తొలి వికెట్‌ను కైవసం చేసుకున్నాడు. చివరి ఓవర్లో ఒక వికెట్ చేతిలో ఉండగా హైదరాబాద్(Hyderabad) విజయానికి 20 పరుగులు చేయాల్సి ఉంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని అర్జున్‌కి ఇచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతికి భువనేశ్వర్ కుమార్ రోహిత్(Rohith)కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ముంబై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్జున్ 2.5 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
తన తొలి వికెట్ తీసిన తర్వాత, అర్జున్ మాట్లాడుతూ.. ‘నా తొలి ఐపీఎల్ వికెట్ (IPL wicket)ను సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రస్తుతం రాబోయే మ్యాచుల్లో అమలు చేయాల్సిన ప్రణాళికపై దృష్టి పెట్టాను. నాకు బౌలింగ్ చేయడం చాలా ఇష్టం. కెప్టెన్ అడిగినప్పుడల్లా బౌలింగ్ చేయడం ఆనందంగా ఉంది. జట్టు ప్రణాళికకు కట్టుబడి నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.’
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో ముంబయి ఇండియన్స్(Mumbai Indians) హ్యాట్రిక్ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు చేయలేకపోయింది. 19.5 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ముంబయి 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.
A special moment for young Arjun Tendulkar, who gets his first wicket in #TATAIPL and it is his captain Rohit Sharma, who takes the catch of Bhuvneshwar Kumar.