BAN vs PAK: తడబడిన బంగ్లా..7 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం
వన్డే వరల్డ్ కప్‌లో నేడు బంగ్లాదేశ్‌పై పాక్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ విజయాన్ని పొందింది. మూడు వికెట్లకు లక్ష్యాన్ని ఛేదించడంతో నెట్ రన్ రేట్‌ను పాక్ జట్టు పెంచుకుంది. బాబర్ సేనకు విజయం దక్కడంతో పాక్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో నేడు బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు తడబడటంతో స్వప్ప స్కోరుకే బంగ్లా పరిమితమైంది. 45.1 ఓవర్లలో 204 పరుగులకు బంగ్లాదేశ్ జట్టు ఆలౌట్ అయింది. బంగ్లా జట్టులో మహ్మదుల్లా 56, లిటన్ దాస్ 45, కెప్టెన్ షకిబ్ అల్ హసన్ 43 పరుగులు చేశారు. పాక్ పేసర్లలో అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్లు తలొక మూడు వికెట్లు తీశారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు మొదట్లోనే వరుస షాకులు తగిలాయి. తొలి ఓవర్లోనే బంగ్లా ఓపెనర్ తాంజిద్ హసన్ పరుగులేమీ చేయకుండానే షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో ఔటయ్యాడు. అఫ్రిది అదే ఊపులో తన తర్వాత ఓవర్లో నజ్ముల్ శాంతోను పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన పాక్ జట్టు 32.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి విజయం సాధించింది.
205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు మరో 17.3 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్‌ను రీల్ అయ్యింది. 32.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని పొందింది. దీంతో తన నెట్ రన్‌రేట్‌ను పాక్ జట్టు గణనీయంగా పెంచుకుంది. పాకిస్తాన్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ 81, అబ్దుల్లా షఫీక్ 68 పరుగులు చేసి అర్థశతకాలతో రాణించారు. ఇకపోతే బాబర్ అజామ్ 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇఫ్తికార్ అహ్మద్ అహ్మద్ 17 పరుగులు, మహ్మద్ రిజ్వాన్ 26 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు.