టీమ్‌ఇండియా మొత్తం స్టార్ ఆటగాళ్లే ఉన్నారు. ఒంటి చేత్తో గెలిపించే బ్యాటర్లు. ప్రత్యర్థిని ముప్పుతిప్పులు పెట్టించే బౌలర్లు ఉన్నారు. అయినా వెస్టిండీస్‌తో ఆడుతున్న టీ20 సిరీస్‌లో 0-2తో వెనుకంజలో ఉన్నారు. మరీ ఈరోజు జరిగే మ్యాచ్‌లో నెగ్గకపోతే.. మరీ టీమ్ వెనుకపడడానికి కారణం ఏంటి.? లోపం ఎక్కడ అనేది విషయంపై సమీక్షిద్దాం.
భారత యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్ ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లో భారత మిడిలార్డర్‌లో రాణిస్తాడు అనుకుంటున్న తరుణంలో తన బ్యాటింగ్ తీరుపై మాజీ సెలెక్టర్ సబా కరీం, భారత మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ కీలక సూచనలు చేశారు.
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఓటమి నుంచి గుణపాఠం తీసుకున్న భారత జట్టు మూడో వన్డే(3rd odi)లో 200 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. చివరి మ్యాచులో టీమ్ ఇండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ముఖేష్ కుమార్(mukesh kumar) తన స్వింగ్ బౌలింగ్ తో ఇండియా జట్టు విజయానికి కీలక సపోర్ట్ నిచ్చాడు.
శనివారం జరిగిన రెండో వన్డేలో ఓటమి నుంచి పుంజుకుని ఆతిథ్య వెస్టిండీస్‌పై మంగళవారం జరగనున్న మూడో, చివరి వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా సిరీస్ విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. మొదటి వన్డేలో భారత్ గెలుపొందగా, వెస్టిండీస్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది.