ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తొలి విజయం నమోదు చేసింది. రెండు వరుస ఓటమిల తర్వత బోణి కోట్టింది. దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మళ్లీ తీవ్ర నిరాశ తప్పలేదు.హొరా హొరీగా సాగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.173 పరుగుల లక్ష్యఛేదనను ముంబయి 4 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి పూర్తి చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తొలి విజయం నమోదు చేసింది. రెండు వరుస ఓటమిల తర్వత బోణి కోట్టింది. దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మళ్లీ తీవ్ర నిరాశ తప్పలేదు.హొరా హొరీగా సాగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యఛేదనను ముంబయి 4 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి పూర్తి చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma) 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 65 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన తెలుగుతేజం తిలక్ వర్మ(Tilak Verma) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో 41 పరుగులు చేశాడు.
కీలక సమయంలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ అవుట్ కావడంతో ముంబయి కష్టాల్లో పడినట్టు అనిపించింది. సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) తొలి బంతికే అవుటై ముంబయి శిబిరాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. అయితే, చివర్లో కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ జోడీ మరో వికెట్ పడకుండా ముంబయి ఇండియన్స్ ను విజయతీరాలకు చేర్చింది. ఆఖరి ఓవర్ ను నోర్కియా కట్టుదిట్టంగా వేయడంతో చివరి బంతికి ముంబయి 2 పరుగులు చేయాల్సి వచ్చింది. టిమ్ డేవిడ్(Tim David), కామెరాన్ గ్రీన్ అద్భుతమైన రీతిలో రెండు పరుగులు తీసి ముంబయి శిబిరంలో ఆనందం నింపారు. గ్రీన్ 17, టిమ్ డేవిడ్ 13 పరుగులతో అజేయంగా నిలిచారు.