»Mayank Agarwal Was The First To Post From The Hospital
Mayank Agarwal: ఆసుపత్రి నుంచి తొలి పోస్ట్ చేసిన మయాంక్ అగర్వాల్
యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ అభిమానులతో తన హెల్త్ అప్డేట్ పంచుకున్నారు. మంచి నీల్లు అనుకొని హానికరమైన ద్రవాన్ని తాగిన మయాంక్ అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
Mayank Agarwal was the first to post from the hospital
Mayank Agarwal: యంగ్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) ఫ్లైట్‌లో వాటర్ అనుకొని హానికరమైన ద్రవాన్ని తాగి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఈ మేరకు మయాంక్ అగర్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం తాను కోలుకున్నట్లు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. తన కోసం ప్రార్థించిన తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
రంజీ ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న యంగ్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ త్రిపురలో ఆట ముగించుకొని టీమ్‌తో సహా ఢిల్లీకి బయలు దేరాడు. విమాన ప్రయాణంలో ఆయన ముందున్న కవర్లో ఉన్నవి మంచి నీళ్లు అనుకొని తాగాడు. అది హానికరమైన ద్రవం కావడంతో నోటిలో, గొంతులో బొబ్బెలు వచ్చాయి. వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే మళ్లీ టీమ్‌లోకి రానున్నారు.