Hindus can worship in Gnanavapi Masjid.. Court orders
Gnanavapi Masjid: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు(Gnanavapi Masjid) కేసులో వారాణాసి డిస్ట్రిక్ట్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ కీలక ఆదేశాలు వెలువరించింది. జ్ఞానవాపి మసీదులోని దక్షిణ సెల్లార్ లో హిందువులు పూజలు చేసుకోవచ్చని వెల్లడించింది. హిందువులు అక్కడ పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, శ్రీ కాశీ విశ్వనాథ్ ట్రస్టు ద్వారా ఓ పూజారిని నియమించాలని కోర్టు నివేదికలో పేర్కొంది.
జ్ఞానవాపి కేసులో హిందువుల తరఫున వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాతో మాట్లాడారు. మరో ఏడు రోజుల్లో పూజ ప్రారంభం కానుందని, ఇక్కడ పూజ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని తెలిపారు. వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను పై కోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాది అఖ్లాక్ అహ్మద్ పేర్కొన్నారు. వారు కోర్టులో పిల్ వేస్తే హిందువులు పూజలు చేసుకునేందుకు వీలు కాదని తెలుస్తుంది. ఎందుకంటే కోర్టులో విచారణ జరిగేంత కాలం పూజలు నిర్వహించకూడదు అని కోర్టు ఆదేశాలు ఇస్తుంది.