హర్యానా ఓపెనర్ యశ్వర్ధన్ దలాల్ సీకే నాయుడు ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచులో 463 బంతుల్లో (46 ఫోర్లు, 12 సిక్సర్లతో) 426* పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ టోర్నమెంట్ చరిత్రలో 400 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి హర్యానా 8 వికెట్ల నష్టానికి 732 పరుగుల భారీ స్కోరును సాధించింది.