బీసీసీఐ(BCCI) అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రోజర్ బెన్నీ(roger binny) షాకింగ్ కామెంట్స్ చేశాడు. 2023 ఆసియా కప్ విషయంలో… భారత్, పాక్ క్రికెట్ బోర్డు మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా క్రికెటర్లు పాక్ వెళ్లి ఆడటానికి.. మన దేశ ప్రభుత్వం అంగీకరించడం లేదు.. దీంతో… ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. ఈ విషయంపై బిన్నీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇతర దేశాలకు వెళ్లే విషయంలో బీసీసీఐ సొంతంగా నిర్ణయాలు తీసుకోదని, భారత ప్రభుత్వ ఆదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉందని వివరించారు. వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్‌ను తటస్థ వేదికగా నిర్వహించేందుకు భారత కృషి చేస్తుందని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపిన కొన్ని రోజులకే బిన్నీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. విదేశాలకు వెళ్లేందుకు బీసీసీఐ భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని రోజర్ బిన్నీ స్పష్టం చేశారు.
‘భారత జట్టు ఇతర దేశాలకు వెళ్లినా లేదా ఇతర దేశాలు భారత్ కు వచ్చినా ప్రభుత్వం నుండి క్లియరెన్స్ తీసుకోవాలి. మేం సొంతంగా ఆ నిర్ణయం తీసుకోలేమన్నారు. ప్రభుత్వంపై ఆధారపడాలని’ బిన్నీ తెలిపారు. అయితే 2023 ఆసియా కప్ హక్కులు పాకిస్థాన్ దగ్గర ఉన్నాయి. అయితే, ఈ టోర్నీ కోసం భారత్.. పాక్ వెళ్లదని జై షా చెప్పారు. ఈ టోర్నీని తటస్థ వేదికపైనే ఆడుతుందని ఆయన ప్రకటించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా ప్రతిస్పందించింది.
ఈ ప్రకటన తమను ఆశ్చర్యానికి గురి చేసిందని పీసీబీ చెప్పింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న జై షా అధ్యక్షత వహించిన సమావేశంలోనే పాక్ బోర్డుకు ఆతిథ్య హక్కులు లభించాయని పీసీబీ పేర్కొంది. ఆసియా కప్ 2023 కోసం భారత్ జట్టు పాకిస్థాన్‌కి రాకపోతే 2023 వన్డే ప్రపంచకప్ కోసం భారత్ గడ్డపైకి పాకిస్థాన్ జట్టుని పంపబోమని కూడా పీసీబీ పరోక్షంగా హెచ్చరించడం గమనార్హం.