ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా గుకేశ్-లిరెన్ మధ్య జరిగిన నాలుగో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో 14 రౌండ్ల గేమ్‌లో ప్రస్తుతం వీరిద్దరు చెరో రెండు పాయింట్లతో సమంగా నిలిచారు. శనివారం ఐదో మ్యాచ్ జరగనుంది. తొలి గేమ్‌లో ఓటమి పాలైన భారత్ ఆటగాడు గుకేశ్.. రెండో గేమ్‌ను డ్రాగా ముగించాడు. రెండు రౌండ్లు ముగిసే సరికి 0.5-1.5తో వెనుకంజలో ఉన్నాడు.