మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ (68), కమిన్స్ (8) ఉన్నారు. కొన్స్టాస్ (60), ఖవాజా (57), లబుషేన్ (72) రాణించారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.