భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, చైనా ఆటగాడు డింగ్ లిరెన్ మధ్య సింగపూర్ వేదికగా ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ హోరాహోరీగా సాగుతోంది. ఈ ఇరువురి మధ్య జరిగిన నాలుగో గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో 14 గేమ్‌లు ఉన్న ఈ టోర్నీలో 4 గేమ్‌లు ముగిసేసరికి ఇరువురి ఖాతాలో తలా 2 పాయింట్లు చేరాయి. 42 ఎత్తుల తర్వాత ఆట డ్రా గా ముగిసింది. ఇవాళ ఐదో గేమ్ జరుగనుంది.