భారత స్టార్ పేసర్ బుమ్రా టెస్టుల్లో మరో రికార్డు నెలకొల్పాడు. 2024లో టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అడిలైడ్ టెస్టులో బుమ్రా 50 వికెట్ల మార్క్ అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో ఒకే ఏడాది 50 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో బుమ్రా చేరాడు. కాగా, ఓ క్యాలెండర్ ఇయర్లో కపిల్ దేవ్ రెండు సార్లు 50+ వికెట్లు సాధించాడు. 1979లో 74 వికెట్లు, 1983లో 75 వికెట్లు పడగొట్టాడు. 2002లో జహీర్ ఖాన్ 51 వికెట్లు తీశాడు.