ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి ఓవర్ నాలుగో బంతికే హెండ్రిక్స్ వికెట్ను అర్ష్దీప్ సింగ్ పడగొట్టగా, రెండో ఓవర్లో డికాక్(0)ను హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. దీంతో సౌతాఫ్రికా కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.