టీమిండియాతో జరిగిన పుణె టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ శాంట్నర్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 20 వికెట్లలో 13 వికెట్లను ఒక్కడే సాధించాడు. అటు భారత్‌పై రెండు ఇన్నింగ్స్‌లలోనూ 5 వికెట్ హాల్ సాధించిన తొలి కివీస్ స్పిన్నర్‌గా చరిత్రలో నిలిచాడు. కాగా పుణె టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు శాంట్నర్‌కే దక్కింది.