తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా న్యూజిలాండ్ ముందు 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకుంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాగా, టెస్ట్ ఫార్మాట్లో చివరి రోజు లక్ష్యాన్ని చేధించడం కష్టం. ఎందుకంటే పిచ్‌పై పగుళ్లు ఏర్పడి వికెట్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. అనూహ్య బౌన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతోంది. దీంతో టీమిండియా గెలుస్తుందనే వాదన వినిపిస్తోంది.